
పయనించే సూర్యుడు జులై 23 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టేకులపల్లి లో వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ సంపూర్ణంగా జరిగిందని పి డి యస్ యూ ఇల్లందు డివిజన్ సహాయ కార్యదర్శి గంగాధర గణేష్ , ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కిషోర్ , పి డి యస్ యూ టేకులపల్లి మండల నాయకులు భార్గవ్ అన్నారు. పాఠశాలలు కళాశాలల బంద్ సందర్భంగా వారు మాట్లాడుతూ
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల,కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్,బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీచర్స్, లెక్చరర్స్, ఎంఈఓ, డిఇఓ పోస్టులను భర్తీ చేయాలన్నారు విద్యార్థులకు ఉచిత బస్సు పాసులను అమలు చేయాలన్నారు. గురుకులాలకు, ఎస్ఎంఎస్ హాస్టల్లకి సొంత భవనాలు నిర్మించాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలన్నారు. విద్యారంగ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని అందులో భాగంగానే వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్ సురేష్,కిషోర్,శైలజ,జీవన్, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.