
ఈ మహాసభలకు SFI తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రజనీకాంత్ గారు హాజరై మాట్లాడుతూ SFI 1970 లో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో డిసెంబర్ 30 , 31 తేదీల్లో స్వాతంత్రం ప్రజాస్వామ్యం అనే లక్షణం పెట్టుకొని అధ్యయనం పోరాటం చదువుతూ పోరాడు.. చదువుకై పోరాడు… అనే నినాదాలు తీసుకొని ముందుకు సాగుతుందని అన్నారు. ఎస్ఎఫ్ఐ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అనేక విద్యార్థి సమస్యల పైన అలుపెరుగని పోరాటం చేస్తుందని అన్నారు . విద్యార్థులకు స్కాలర్షిప్లో ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గురిచేస్తున్నాయా అన్నారు . రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కార్పొరేట్ నారాయణ శ్రీ చైతన్య విద్యాసంస్థలు తల్లిదండ్రుల దగ్గర కోట్ల రూపాయలు ఫీజుల రూపంలో దండకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వం ఈ కార్పొరేట్ విద్యా సంస్థల పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలు నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఆమనగల్ కేంద్రంలో నేటికీ ప్రభుత్వ కళాశాల అసంపూర్తిగా ఉండే చెట్ల కింద ఆరుబయట చదువుకున్నటువంటి పరిస్థితి ఉంది . ఏదైతే రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి నిధులు కేటాయించకుండా విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది విద్యారంగం అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర బడ్జెట్లో 30% నిధుల కేటాయించాలని కొఠారి కమిషన్ చెప్తే కానీ ప్రభుత్వాలు విద్యారంగానికి నిధులు కేటాయించకుండా నెరవేరియం చేస్తున్న పరిస్థితి ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం వల్ల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగే జరుగుతుంది కాబట్టి ఈ ఒక నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందన్నారు.ఈ సందర్భంగా *21 మందితోని నూతన జిల్లా కమిటీ. 9 మందితో కార్యదర్శి వర్గం ఎన్నో కొన్నారు. ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా KY ప్రణయ్ , బి శంకర్ ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా మస్కు చరణ్ , వడ్ల శ్రీకాంత్ , గుండె శివ, ఏర్పుల తరంగ్ , సహాయ కార్యదర్శిగా అరుణ్ , మద్దెల శ్రీకాంత్ , మీసాల స్టాలిన్ జిల్లా కమిటీ సభ్యులుగా బి. వంశీ , శ్రీనివాస్ , విప్లవ కుమార్, తనీష్ , ప్రణవ్ , శివ , తరుణ్ , రాము , చరణ్
