Wednesday, March 19, 2025
Homeఆంధ్రప్రదేశ్అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రను వెంటనే మానుకోవాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్….

అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రను వెంటనే మానుకోవాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్….

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో

అంగన్వాడి పోరాటాలకు సంఘీభావం తెలిపిన సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ను ముట్టడించిన అంగన్వాడి కార్యకర్తలు. ఉద్రిక్తంగా మారిన ఆందోళన అక్రమ అరెస్టులు. అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళనలో భాగంగా రెండవ రోజు కలెక్టరేట్ ముట్టడిని కొనసాగించారు. ఉదయం 9 గంటలకే పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని ఉద్యోగులు ఎవరూ లోనికి వెళ్లకుండా కలెక్టరేట్ గేట్లకు అడ్డంగా కూర్చొని నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కు చేరుకున్న పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలతో బెదిరింపులకు పాల్పడటంతో సిఐటియు నాయకులు పోలీసులతో వాగ్వాదానికి పూనుకోవడం జరిగింది. శాంతియుతంగా తమ నిరసనను తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలను సిఐటియు నాయకులను పోలీస్ అధికారులు తమ సిబ్బందిని ఉసిగొలిపి ఈడ్చుకెళ్తూ దౌర్జన్యం చేసి అరెస్టులకు పూనుకోవటంతో కార్యకర్తలు తమ ఆందోళనను పట్టుదలగా కొనసాగించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం అనేక మార్లు ప్రభుత్వానికి జిల్లా అధికారులకు విన్నవించుకున్నప్పటికీ అంగన్వాడీల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించటం తోటే 15 నెలల అనంతరం ఓపిక నశించిన అంగన్వాడీ కార్యకర్తలు శాంతియుత నిరసనకు బడ్జెట్ సమావేశాల సందర్భంగా నైనా ప్రభుత్వం నిర్దిష్ట హామీని ఇవ్వాలని నిర్ణయించటం జరిగిందని తెలిపారు ఒకవైపు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు కేటాయించే బడ్జెట్ను ప్రతి సంవత్సరం తగ్గిస్తూ ఐ సి డి ఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే పద్ధతుల్లో పీఎం శ్రీ పథకాన్ని తీసుకొచ్చారని పాటు నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని తద్వారా అంగన్వాడీ ఉద్యోగుల భద్రతకే ముప్పు వాటిలో విధానం కొనసాగుతుందని అందువల్ల దాన్ని రద్దు చేయాలని చేశారు అదేవిధంగా అంగన్వాడీ ఉద్యోగులు చేసిన 24 రోజుల సమ్మె సందర్భంగా నేటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అంగన్వాడి ఉద్యోగులకు ఎనిమిది వేల రూపాయల వేతనం ఇస్తామని భద్రత కల్పిస్తామని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను టీచర్కు రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చి వాటిని అమలు జరపకపోగా పది నెలల నుండి సెంటర్ హద్దులు కూరగాయల బిల్లులు కే డి ఏ లు బకాయిలు పెట్టడంతో అంగన్వాడీ ఉద్యోగుల పైన ఆర్థిక భారం పడుతుందని తమ వేతనాల్లో నుండే వాటిని భరించాల్సి వస్తుందని అన్నారు. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తల పైన కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ రిపోర్టుకు ఒక యాప్ను రాష్ట్ర ప్రభుత్వం మరొక యాప్ను ప్రవేశపెట్టి ఉన్నతాధికారులు చేయని పనులన్నీ ఆన్లైన్లో అంగన్వాడీ కార్యకర్తలతో చేయించటం మూలంగా తీవ్రమైన పని భారం పడుతుందని దీన్ని ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేనియెడల ఈ పోరాటం మరింత పెద్ద ఎత్తున కొనసాగిస్తామని హెచ్చరించారు అంగన్వాడీల పోరాటానికి సంఘీభావం గా సిపిఎం జిల్లా కార్యదర్శి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు పాల్గొని మాట్లాడారు.. పోలీసులు నాయకులను అరెస్టు చేసిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, సహాయ కార్యదర్శి నన్నే సాబ్, అంగన్వాడి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి స్వర్ణ జిల్లా కోశాధికారి చంద్రకళ జిల్లా నాయకులు వాణి తదితరులతోపాటు ముఖ్య నాయకులు నగరంలోని నాలుగో టౌను మరియు ఆరవ టౌన్లలో నిర్బంధించటంతో అంగన్వాడీ కార్యకర్తలు నువ్వు విడుదల చేసే వరకు కలెక్టరేట్ నుంచి కదలబోమని భీష్మించుకొని కూర్చోవడంతో జిల్లా కలెక్టర్ ప్రధాన ద్వారం వద్దకు వచ్చి అంగన్వాడీ కార్యకర్తలతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో పాటు అరెస్టు చేసిన నాయకులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం అరెస్టు అయిన నాయకులు విడుదల అయ్యేంతవరకు అంగన్వాడీ కార్యకర్తలందరూ కలెక్టరేట్ వద్దనే బయట ఇంచటంతో అరెస్టు చేసిన వారిని విడుదల చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దేవగంగు, జిల్లా నాయకులు మంగాదేవి, శివరాజమ్మ, జ్యోతి, గోదావరి, జగదాంబ, సందీప, సవిత, సునీత సిఐటియు నాయకులు ఈవీఎల్ నారాయణ, మోహన్, వేషాల గంగాధర్ తదితరులతోపాటు వందలాది మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments