పయనించే సూర్యడు జనవరి 10 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని శ్రీ సాయి పబ్లిక్ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకలు ఆకట్టుకున్నాయి విద్యార్థులు చిన్ని కృష్ణుడు హరిదాసు, సోది అమ్మ గోదాదేవి అలంకరణలో ఆకట్టుకున్నారు. చిన్నారులకు సామూహికంగా భోగి పండ్లు పోశారు విద్యార్థులకు రంగవల్లికలు ముగ్గుల పోటీలు నిర్వహించారు అనంతరం భోగిమంటలతో విద్యార్థుల ఆటపాట ఆకట్టుకున్నాయి మన పండుగల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కోసం ముందస్తు సంక్రాంతి వేడుకలు మూడు రోజులుగా నిర్వహించే పండగ విశిష్టతలను విద్యార్థులకు తెలియపరిచేందుకు కార్యక్రమం నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ బుస్సా సులోచన కరస్పాండెంట్ బుస్సా మహేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వీరయ్య, సైదులు, రాంబాబు ,లక్ష్మీ, రమ్య, మల్లికా ,వైదేహి, రజియా, జ్యోతి ,నాగమణి, దీన ,త్రివేణి పాల్గొన్నారు.