
ప్రయాణించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 22 తెలంగాణ స్టేట్ ఇన్చారి శ్రీనివాస్ రెడ్డి
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావ్ సేవ్ హైద్రాబాద్ పేరుతో సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉదయాన్నే జ్వరం తో బాధపడుతూ ఇంటివద్దనే ఉన్న బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ ను జగద్గిరిగుట్ట ఎస్సై వినయ్ కుమార్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తో కలిసి అక్రమంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ అక్రమ ఆగస్టులు కాదు చేయాల్సింది హైదరాబాద్ అభివృద్ధి అని అన్నారు. హైదరాబాద్ నగరంలో సమస్యలు చెత్తకుప్పల్ల పేరుకు పోయాయని వాటిని పరిష్కరించే నాధుడే కాంగ్రెస్ ప్రభుత్వం లో కరువయ్యారని అన్నారు. వర్షాలు పడడంతో ఎక్కడికక్కడ రోడ్లన్నీ గుంతల మయమై చెరువులు కుంటల్లా రోడ్లన్నీ తలపిస్తున్న ఒక్క మంత్రిగాని, ఎమ్మెల్యేలు గాని పరిష్కరించే దిశగా ఆలోచించని చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నరు. ఎలాంటి పెట్టుబడులు లేని పేరుకుపోయిన చెత్త నగరంగా రేవంత్ రెడ్డి సర్కార్ హైద్రాబాద్ నగరాన్ని తీర్చిదిద్దింది అన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయకపోతే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తావని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అన్నారు.
