
▪️ ఎస్సై తోట తిరుపతి..
పయనించే సూర్యుడు // ఫిబ్రవరి 9// హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్.. వీణవంక మండలం చల్లూరు గ్రామంలో, విలేజ్ పెట్రోలింగ్ చేస్తుండగా, నాగేంద్ర వైన్స్ ముందు , (టీఎస్ జీరో టు యు సి 7730) ట్రాక్టర్ ఇసుక లోడుతో ఎదురుగా రాగా, ట్రాక్టర్ను ఆపి డ్రైవర్ను ఇసుక రవాణా చేసేందుకు ఏమైనా అనుమతి పత్రాలు ఉన్నాయని, ప్రశ్నించగా ఏమి పత్రాలు చూపియ్యకపోవడంతో, ఎక్కడి నుండి ఇసుక తీసుకొస్తున్నారు అని అడగగా,చల్లూరు గ్రామంలో నుంచి, జమ్మికుంటకు తీసుకెళ్తున్నామని డ్రైవరు తెలిపారు , సరైన పత్రాలు లేకపోవడం వల్ల పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కేసు నమోదు చేసి కోర్టుకు పంపించడం జరిగింది అని ఎస్సై తోట తిరుపతి తెలిపారు. మండల పరిధిలోని, ట్రాక్టర్ యజమాను లు, వేరే మండలాలకు చెందిన వారు ఎవరైనా వినవంక మండలంలో అక్రమ ఇసుక రవాణా చేసినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తోట తిరుపతి అన్నారు.