
నక్క బాల్ రాజ్ యాదవ్ కు ఘన సన్మానం
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 షాద్ నగర్ నియజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ ) అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని మినీ ఫంక్షన్ హాల్ లో యాదవులకు పాడి-పరిశ్రమపై అవగాహన సదస్సు ను యాదవ యువత అధ్యక్షుడు లక్ష్మీపతి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిలభారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీందర్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేందర్ యాదవ్, యువత రాష్ట్ర అధ్యక్షుడు గొర్ల యశ్వంత్ యాదవ్,రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నడి కూడ రఘునాథ్ యాదవ్ మరియు అగ్రికల్చర్ డాక్టర్ లలిత యాదవ్ లు పాల్గొని గొర్రెలు,పశువుల వ్యాధి నిరోధకాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. పశువులు వ్యాధుల బారిన పడకుండా పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో అఖిలభారత యాదవ మహాసభ షాద్ నగర్ పట్టణ అధ్యక్షుడు నక్క బాల్ రాజ్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు పద్మారం వెంకటేష్ యాదవ్, జిల్లా యువత ఉపాధ్యక్షులు దావాజి శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా అఖిలభారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైన చింతల రవీందర్ యాదవ్ ను ఘనంగా సన్మానించడం జరిగింది.