
ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి యు. దస్తగిరి.
పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 16, ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ.
ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘించి సమయపాలన పాటించకుండా వాళ్లకు ఇష్టం సారంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించిన రోజుల్లో కూడా పాఠశాలలో నడుపుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ,డిప్యూటీ డిఈఓ కి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చాలా సార్లు విన్నవించినాము. ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘించిన నారాయణ, చైతన్య, భాష్యం, కిడ్డీస్, అమరావతి ఇంటర్నేషనల్, ఆల్ఫా హై స్కూల్ అక్షర శ్రీ పాఠశాలలపై చర్యలు తీసుకొని, వాళ్లకు వత్తాసు పలుకుతున్న విద్యాశాఖ అధికారులు ఎంఈఓ డిప్యూటీలను సస్పెండ్ చేయాలని ఏఐ ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘముగా కోరుతున్నాము ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ పట్టణ కోశాధికారి శేఖర్ పట్టణ నాయకులు మోహన్, శివ తదితరులు పాల్గొన్నారు.
