Thursday, May 29, 2025
Homeఆంధ్రప్రదేశ్అఖిలభారత ఐక్య రైతు సంఘం. జిల్లా ప్రతినిధి బృందం కొనుగోలు చెయ్యని ధాన్యం కుప్పలను పరిశీలించినారు

అఖిలభారత ఐక్య రైతు సంఘం. జిల్లా ప్రతినిధి బృందం కొనుగోలు చెయ్యని ధాన్యం కుప్పలను పరిశీలించినారు

Listen to this article

పయనించే సూర్యుడు 14 మే నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్

జిల్లాతక్షణమే నిర్లక్ష్యమైస్తున్న అధికారులపై,, రైస్ మిల్ యజమానులపై చర్యలు తీసుకొని తక్షణ కొనుగోలు చేయాలని డిమాండ్..వి ప్రభాకర్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. బి దేవారం. కార్యదర్శి.అఖిలభారత ఐక్య రైతు సంఘం. ఏ ఐ యు కె ఎస్ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ప్రతినిధులు.. వి ప్రభాకర్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. దేవారం. కార్యదర్శి.. ఎస్ సురేష్. జిల్లా అధ్యక్షులు. కార్యదర్శి.. బి బాబన్న. జిల్లా నాయకులు.. బి కిషన్. వాల్గోట్ సాయిలు. ఆకుల గంగారాం.. వి బాలయ్య. గంగాధర్. గంగాధర్లు పర్యటించి ఈ క్రింది విధంగా లోపాలు ఉన్నాయని నిర్ధారణకు రావడం జరిగింది.రేవంత్ రెడ్డి సర్కార్ ధాన్యం కొనుగోలను ఒక ప్రతిష్టాత్మకంగా రైతు ప్రయోజనకంగా చేస్తుందని చాలా గొప్పలు చెప్పుకుంది.. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల పైగాధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని.. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను విపరీతంగా పెంచామని గొప్పలు చెప్పుకుంది..ఈ జిల్లాలో సుమారుగా సుమారు 13 లక్షల లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాము ఉత్పత్తి అవుతుందని అందులో ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల మెట్రిక్ టన్ను ధాన్యాన్ని సేకరిస్తామని గత కొనుగోలు కేంద్రాల కన్నా ఎక్కువ సంఖ్య చేసి సేకరిస్తున్నామని జిల్లా పాలన యంత్రాంగం సీజనకు ముందే హడావిడిగా ప్రకటన చేసింది.కొనుగోలు కేంద్రాలు సహకార సంఘాలు.. ఐకెపి.. డీసీఎంఎస్ తదితర సంస్థల ద్వారా కొనుగోలు చేస్తున్నామని.. ఒక్క గింజ కూడా తరుగు అవసరం లేదని సన్నధాన్యానికి 500 రూపాయలు బోనస్ చెల్లిస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు.. కానీ క్షేత్రస్థాయిలో వీటికి భిన్నంగా ఉంటుంది. ఇప్పటికే అధికారులు ధాన్యం కొనుగోలు పూర్తయిందని ఒకవైపు ప్రకటనలు చేస్తుండగా మరోవైపు రెండు మూడు లక్షల మెట్రిక్ టన్నులు రోడ్లపైనే గత నెల.. నెల 15 రోజుల నుంచి మూడుసార్లు తడిసి ఎండి మొలకలు మొలకలు ఎత్తాయని ఈరోజు మా ప్రతినిధి బృందం జక్రాంపల్లి మండల పరిధిలో అర్గుల్ రైతు సహకార సంఘం పరిధిలోని అర్గుల్. సికింద్రాబాద్ పూర్ . పు ప్పలపల్లి. గ్రామాలను రోడ్లపై ఉన్న కుప్పలను పరిశీలించింది. అనేక మంది రైతుల , పాత్రికేయ మిత్రులసమక్షంలోనే డి సి ఓ డి ఎం ఓ డీఎస్ఓ. ఫోన్లు చేస్తే ఏ ఒక్కరు కూడా స్పందించరు.. నిజాంబాద్ జాయింట్ కలెక్టర్ మాత్రమే పెద్దలు స్పందించి ఈరోజు లారీలని అట్లాగే ప్రత్యేక అధికారుల్ని నియమించి అన్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని రైతుల్ని ఓపిక పట్టమని సముదాయించారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న అధికారుల వై విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం . అర్గుల్ సహకార సంఘ అధ్యక్షులు. గంగారెడ్డి మేము అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. కలెక్టర్ కి పదేపదే చెప్పాం.. మా రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి కి కూడా చెప్పాం ఇంతకన్నా మేము ఎక్కువ ఏం చేయాలి అని వాపోయారు.. ఉదాహరణకు అర్హులు గ్రామంలో..సల్ల పెద్ద సాయన్న. చిట్టి నడిపి సాయి అన్న. తాళ్లరేకుల విజయ. బొల్లం దేవారం. గుండ అంజయ్య. జి చిన్న గంగారాం. తొగరి. బోజారాం. రైతులు 45 రోజులుగా రోడ్లపై కుప్పలు పోసి ఉన్న ధాన్యం మూడుసార్లు తడిసి ఎండి మొలకలు ఎత్తాయని కంటనీరు పెట్టుకున్నారు.. మాకు సీరియల్ నెంబర్ 20..21.. 26 ఇచ్చారు.. పలుకుబడిన రైతులు ఏ సీరియల్ లేకుండానే వారి ధాన్యం రైస్ మిల్ కు తరలింది అని కూడా వాపోయారు..మరో రైతు సంచులు నింపి పది రోజులు గడుస్తున్న లారీలు రావడం లేదు రాత్రి వర్షంలో సంచులన్నీ ముద్దాయిని బాధ స్వరంతో తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు..పుప్పాలపల్లి రైతు.. నాలుగు రోజుల క్రితం సుతులం గ్రామ రైస్ మిల్లుకు లోడు చేసి పంపారు.. లోడు చేసే సందర్భంగా క్వింటాలకు నాలుగు కిలోల తరుగు కడతా అదనంగా ఇచ్చారు.. కానీ నాలుగు రోజులకు రైస్ మిల్ యజమాని లారీ డ్రైవర్ తో ఫోన్ చేయించి అదనంగా ఇంకా తరుగు ఇస్తేనే అన్లోడ్ చేసుకుంటామని చెప్పారని వాపోయారు. ఇదే గ్రామానికి చెందిన రైతు కాలూరు రైస్ మిల్లు కు ఇదే పరిస్థితి.. మాకూర్ సహకార సంఘం పరిధిలో పాలకవర్గం.. రైస్ మిల్ యజమాన్యం కుమ్ముక్కై అగ్రిమెంటు భిన్నంగా తరుగు తీసుకోగా అదనంగా కావాలని తిరిగి లారీ డ్రైవర్లతో సతాయింపులు చేయిస్తూ ఒక్క లోడుకు 12 క్వింటాల అదనంగా తీసుకున్నారని రైతులు వాపోతున్నారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అర్గుల్ గ్రామంలో పుప్పాలపల్లి.. సికింద్రా పూర్. జక్రాన్ పల్లి.. ఆర్మూర్. కమ్మర్పల్లి.. మోర్తాడ్ తదితర మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. సుమారుగా రెండు మూడు మెట్రిక్ టన్ లో ధాన్యం రోడ్లపైనే లారీల కొరత హమాలీల కొరత.. రైస్ మిల్ యజమానులు అదనం తరుగు కోసం తొందరగా అన్లోడ్ చేసుకోకపోవడం మూలంగా ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడిందని మా బృందం అభిప్రాయపడుతుంది..నిన్న జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ ఆర్మూర్.. కమ్మర్పల్లి తదితర ప్రాంతాలు పర్యటించి వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకొని సమస్యను వెంటనే పరిష్కారం చేస్తున్న హామీ ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో ఈరోజు ఆర్మూర్ రైతాంగం రోడ్ల పైన నిరసన వ్యక్తం చేశారు..గతంలో కూడా కోట్ల రూపాయల కుంభకోణం ఈ జిల్లాలో రైస్ మిల్ యజమానులు పాల్పడ్డారని అనేక ఆరోపణలు వచ్చినాయి.. ఈ సీజన్లో విపరీతంగా తరువు తీసుకుంటూ.. నిర్లక్ష్యం వహిస్తున్న ఒక్క రైస్ మిల్లు పైన కూడా చర్య తీసుకోకపోవడం విచారకరమని అందుకే అలుసుగా భావించి రైస్ మిల్ యజమానులు రైతుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారని జిల్లా యంత్రాంగాన్ని గుర్తు చేస్తున్నాం..కావున మీరు వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తరుగు తీసుకోకుండా,, లారీలను వెంటనే ఏర్పాటు చేసి రోడ్లపై ఉన్న ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేస్తున్నాం..ఈ కార్యక్రమంలో అర్గుల్ గ్రామ రైతులు జగదీష్.. గంగారాం.. పు ప్పలపల్లి. జక్రాన్ పల్లి.. తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments