
పయనించే సూర్యుడు జూన్ 6 శర్మాస్ వలి మండల్ రిపోర్టర్ యాడిక
యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో చింతలాయపల్లి గ్రామస్తులు పప్పు పుల్లన్న 5వ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య పప్పు నారాయణమ్మ, పెద్దకొడుకు శేఖర్ నరసింహ, కోడలు కమల, చిన్న కొడుకు ధన ఆంజనేయులు, కోడలు కుమారి, కూతురు లక్ష్మీదేవి, అల్లుడు పుల్లయ్య, రామదాసు, రామ తులసి, మనవళ్లు నవీన్ కుమార్, సంతోష్ కుమార్, భువనేశ్వర్, హర్షవర్ధన్ వీరి కుటుంబము అగాపే ఆశ్రమాన్ని ప్రేమించి అందులో ఉంటున్న నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.కుటుంబం అంతా కలిసి అందరికి భోజనాలు వడ్డించారు.ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలో వారంతా వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.
