
వాపస్ వెళ్లిన నిధులను తిరిగి తేవాల్సిన బాధ్యత అధికారులదే
త్రాగునీటి విషయంలో అలసత్వం వహించకూడదు
ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి
పురపాలక సంఘం కార్యాలయం కొత్తూరులో సాధారణ మరియు బడ్జెట్ సమావేశం
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వివిధ పనుల రూపంలో పూర్తి చేయుటలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అధికారుల నిర్లక్ష్య దోరనిపై మండిపడ్డారు. ఈరోజు కొత్తూరు పురపాలక సంఘం కార్యాలయంలో చైర్ పర్సన్ బాదుక లావణ్య దేవేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 2025-2026 ఆర్థిక సంవత్సరమునకు ప్రత్యేక బడ్జెట్ సమావేశము మరియు సాధారణ సమావేశముకు హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హెచ్ఎండిఏ నిధుల నుండి 10 కోట్ల నిధులు మంజూరు కాగా అందులో కేవలం మూడు కోట్ల నిధులకు సంబంధించిన పనులను మాత్రమే పూర్తిచేసి ఏడు కోట్లకు సంబంధించిన పనులను పూర్తి చేయటంలో అధికారులుగా పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఏడు కోట్ల నిధులు వాపస్ పోవటానికి కారణమయ్యారు.అంతేకాకుండా వాపసుపోయిన ఏడు కోట్ల హెచ్ఎండిఎ నిధులను తిరిగి ఏ విధంగా తీసుకురావల్లో వాటిని తిరిగి తీసుకొచ్చి గతంలో ఏ పనుల కోసమైతే తీర్మానాలు చేశారు అదే పనులకు నిధులను కేటాయించి అభివృద్ధికి పాటుపడాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్లకు ప్రోటోకాల్ సమస్య ఉందని మున్సిపాలిటీలో ఏ వార్డులో ఏంపని జరిగినా ప్రతి కౌన్సిలర్లకు సమాచారాని తప్పని సరిగా ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా వచ్చే రెండు మూడు మాసాలు మున్సిపాలిటీలో ఎటువంటి నీటి సమస్య రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రజల త్రాగునీటి అవసరాలను తీర్చాలని అధికారులకు సూచిస్తూ ప్రతి కౌన్సిలర్ కు ఉన్న ప్రత్యేక విధులతో తమ వార్డులో అభివృద్ధి కొరకు నిధులను పొందే హక్కు ఉందని కన్సిలర్స్ కి సూచన చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బాల్ రాజు, వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్లు మాధవి గోపాల్ గౌడ్,చంద్రకళ రాజేందర్ గౌడ్, కోస్గి శ్రీను, సోమ్లా నాయక్,అనిత శ్రీనివాస్ గౌడ్,హెమావతి, జయమ్మ, మాదారం నర్సిములు గౌడ్, ప్రసన్న యాదయ్య,కరుణశ్రీ మరియు పురపాలక సంఘం అధికారులు తదితరులు హాజరైనారు.