Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్అనంతసాగరం లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మునగపాటి సునీత సుబ్బరాజు

అనంతసాగరం లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మునగపాటి సునీత సుబ్బరాజు

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 11 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి)

మండల కేంద్రమైన అనంతసాగరంలోని శనివారం తెలుగుదేశం నాయకులు కేతా శ్రీనివాసులురెడ్డి, చల్లా శివారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు మునగపాటి సునీత సుబ్బరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి అధ్యక్షురాలు మునగపాటి సునీత సుబ్బరాజు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయని ఆమె అన్నారు. తెలుగుదేశం నాయకులు కేత శ్రీనివాసులు రెడ్డి, చల్లా శివారెడ్డి మాట్లాడుతూక్రికెట్ టోర్నమెంట్ కు 15 జట్లు పేర్లు నమోదు చేసుకున్నట్లు అన్నారు. ఈ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన మొదటి బహుమతి 25 వేల రూపాయలు, రెండవ బహుమతి 15 వేల రూపాయలు నగదు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మునగపాటి సునీత సుబ్బరాజు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడా మైదానం లోని క్రికెట్ ను నాయకులు తిలకించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బట్రెడ్డి జగన్మోహన్ రెడ్డి, మునగపాటి ప్రతాప్, జావీద్, కార్యనిర్వాహకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments