
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 2
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు () అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ మొదటి విడత నిధులు విడుదలయ్యాయని పి ఓ అపూర్వబరత్ తెలిపారు. పి ఓ అపూర్వ భరత్ అధ్యక్షతన ఐటిడిఎ సమావేశ మందిరం నందు ఉదయం 11గంటలకి లైవ్ పి ఆర్వో జి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గౌరవ ప్రధానమంత్రి మోడీ మొదటి విడత నిధులు మంజూరు చేశారు… పీఎం కిసాన్ 2000/- అన్నదాత సుఖీభవ 5000/- మొత్తం 7000/- జమ అయ్యాయని,
చింతూరు మండలం 2757 మందికి 1 కోటి 92 లక్షల 99 వేల రూపాయలు రైతుల ఖాతాలకి శనివారం జమ అయ్యాయని తెలిపారు .. రైతులు తమ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోవాలన్నారు. చింతూరు ఐటిడిఎ పరిధిలో ఉన్న నాలుగు మండలాలకు 7832 మంది రైతులకు 5 కోట్ల 48 లక్షల 24 వేల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు.. ఇంకా మండలం లోని కొందరు రైతులకు ఎంపీసీఐ లింక్ కాలేదని.. సదరు రైతులు తమ బ్యాంకు కి వెళ్లి ఆధార్ లింక్ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ కేవైసీ కూడా కొందరికి అవ్వలేదని.. దగ్గర్లో ఉన్న పోస్ట్ ఆఫీసు కి వెళ్లి ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్టు అయితే తమ ఆర్ ఎస్ కె స్టాఫ్ ను కలిసి సరిచేయించుకోవాలి.. అర్హుల జాబితా వారి దగ్గర ఉంది. ఈ కార్యక్రమం లో ఏపీవో జగన్నాధ రావు, ఎంపీడీవో శ్రీనివాస్ దొర, వ్యవసాయాధికారి, మండలం లోని రైతులు పాల్గొన్నారు
