
అన్నపూర్ణ అంటే ఆకలి తీర్చే అమ్మలాగ అని ప్రతితెలుగు వారి సెంటిమెంట్
ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు జూన్ 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ప్రతి తెలుగు వారు అనపూర్ణ అనే పేరును ఒక పేరులా కాకుండా ఆకలి తీర్చే అమ్మలాగా భావిస్తారని అలాంటి సెంటిమెంట్ ఉన్న అన్నపూర్ణ కేంద్రాల పేరును మార్చి ఇందిరమ్మ క్యాంటీన్లుగా పేరు పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్ణయం సరైంది కాదని గత కొంతకాలం నుండి హైదరాబాద్ నగరంలో అన్నపూర్ణ భోజన కేంద్రాల ద్వారా ఎంతో మందికి 5 రూపాయలకే భోజనం అందించిందని ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి అన్నారు. ఈ రేవంత్ ప్రభుత్వానికి పేర్లు మార్చడం,విగ్రహాలు మార్చడమే సరిపోయిందని ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఇలా పేర్లు మార్చడం సరైంది కాదని ఎమ్మెల్సి నవీన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.