
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి అక్టోబర్ 8
చట్టి గ్రామపంచాయతీ చట్టి గ్రామంలో జరుగుతున్న మేకల సంతను గ్రామ కార్యదర్శి మరియు గ్రామ పెసా కమిటీ సభ్యుల సచివాలయ సిబ్బంది గ్రామస్తులతో కలసి ప్రతి వారం జరుగుతున్న మేకల సంతను సందర్శించి మేకల వ్యాపారస్తులతో మాట్లాడుతూ వచ్చేవారం నుండి అధికారికంగా మేకల సంత పాట ద్వారా విధి నిర్వహణ జరుగుతుందని కాబట్టి వ్యాపారస్తులు అందరూ సహకరించాలని తెలియజేస్తూ చట్టి గ్రామంలో నూతన కాలనీలో ఉన్నటువంటి పలు సమస్యలను పెసా కమిటీ, గ్రామస్తులు సెక్రటరీ గారికి వివరించిన విషయాలు గ్రామ వీధుల రహదారి వెంబట గృహ యజమానులు వాడకం ద్వారా నీరు రోడ్లపైకి రావడం వలన గ్రామస్తులు పడే ఇబ్బందులను, అలాగే అవగాహన లోపంతో ఇంటి లోపల నిర్మించవలసిన సెప్టిక్ ట్యాంకులను ప్రజలు తిరిగే చోట నిర్మించిన వాటిని గుర్తించి తక్షణమే సదరు యజమానులకు నోటీసులు ఇచ్చి సెప్టిక్ ట్యాంకులను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే కాలనీలో రోడ్లను ఉపాధి పని ద్వారా ఏర్పాటు చేసి తక్షణమే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చట్టి గ్రామ పెసా కమిటీ కార్యదర్శి పోడియం. రామకృష్ణ గ్రామస్తులు రవ్వ. ప్రసాద్ తర్రం. నీలయ్యతుర్రం.వెంకటరామయ్య మయూరి. నారాయణ తర్రం. వెంకటయ్య తదితరులు వివరించడం జరిగింది.