
- పట్టించుకోని అధికారులు…
ఓ ఇంటి వద్ద ట్రాక్టర్ ల ద్వారా ఇసుక డంపులు చేస్తున్న దృశ్యం..
రుద్రూర్, మే 06 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
అభివృద్ధి పనుల పేరిట అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుంది. ఒక ట్రాక్టర్‌కు అనుమతి ఉండగా మూడు నుంచి నాలుగు ట్రాక్టర్ లు ఒకే వేబిల్ తో ఉదయం నుండి సాయంత్రం వరకు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. డబుల్ బెడ్‌రూమ్, సీసీ రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇసుక ట్రాక్టర్ లకు అనుమతి ఇవ్వడంతో దీనిని ఆసరా చేసుకుని ఇసుక మాఫియా అక్రమ రవాణాకు పాల్పడుతోంది. మంజీరా నది నుండి సుంకిని గ్రామం, రుద్రూర్ గ్రామం మీదుగా వర్ని, ఇతర గ్రామాలకు వైపుకు అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగిస్తున్నారు. సీసీ రోడ్ల పనుల పేరిట వే బిల్లులు తీసుకొని రుద్రూర్ గ్రామంలోని బస్టాండ్ వద్ద గల ఓ ఇంటి నిర్మాణానికి సుమారు 10 ట్రాక్టర్ ట్రిప్పుల డంపులు వేస్తున్నారు. ఇలా ప్రభుత్వ పనుల పేరిట ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్న కూడా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.