
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్
శబరిమల ప్రధాన తాంత్రి కంఠారు రాజీవారు ఆశీస్సులు పొందిన అంజన్న
( పయనించే సూర్యుడు మార్చి 27 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో నూతనంగా పున ప్రారంభించిన మహిమాన్విత్వం గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవానికి షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేరళ శబరిమల ప్రధాన తాంత్రి కంఠారు రాజీవారు ఆశీస్సులు పొందిన అంజన్న భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకున్నారు. బుధవారం అంగరంగ వైభవంగా నందిగామ శివారులో నూతనంగా నిర్మించిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అంజన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి యాదవా చారి, ఈట గణేష్, జిల్లెల్ల వెంకట్రెడ్డి, శ్రవణ్ పట్వారి, బాతుక లక్ష్మయ్య తదితరులు మాజీ ఎమ్మెల్యే అంజన్న వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం శబరిమల ప్రధాన తాంత్రి కంఠారు రాజీవారు ఆశీస్సులను మాజీ ఎమ్మెల్యే అంజన్న అందుకున్నారు. అయ్యప్ప భక్త సమాజం ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ ఆలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది నేడు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అంజన్న పేర్కొన్నారు. అయ్యప్ప భక్తులకు ఇది ఒక వరమని ఆయన తెలిపారు.