
గృహ నిర్మాణ శాఖమంత్రి పొంగులేటి.
పయనించే సూర్యుడు; జులై 03: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ.
వాజేడు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒకటి. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యాప్తంగా మండలాలలో ప్రారంభమయ్యాయి. అదేవిధంగా ములుగు జిల్లాలోని పలు మండలాలలో కూడా ప్రారంభం అయిందని చెప్పాలి.కానీ నిజంగా అర్హులకే ఈ పథకం అందుతుందా లేదా అనర్హులకు అందుతుందా అనే సందేహం మండలంలో నివసించే ప్రజలకే కాకుండా ఏకంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అనుమానం రావడం గమనార్హం.వివరాల్లోకి వెళితే గత విడతలు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన సంగతి అందరికీ తెలిసినదే అయితే మంజూరు ఆయన ఇండ్లు చాలా వరకు అనర్హులకు కేటాయించారని గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి.ఈ విషయం ఏ విధంగా మంత్రి పొంగిలేటికి చేరిందో ఏమో కానీ నిన్న అనగా బుధవారం అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు అనర్హులుగా తేలితే సగం పని జరిగిన కూడా వాటిని వెంటనే రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ యొక్క సంగతి తెలిసిన వెంటనే అనర్హులైనటువంటి లబ్ధిదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కారణం వారికి కూడా తెలుసు మేము లబ్ధిదారులమా కాదా అని. అసలు జరిగింది ఏమిటి?జరగాల్సింది ఏమిటి? చాలా గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల లిస్టులో పేర్లు వచ్చినప్పటికీ వాటిని వెంటనే రద్దు చేశారు. కారణం అడిగితే సంబంధిత పంచాయతీ అధికారులు లబ్ధిదారులకు సరైన సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. ఇంకా చెప్పాలంటే ఆర్థికంగా కూడా ముందు ఉన్న వాళ్ళకి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఎలా మంజూరు చేస్తారని చాలామంది ప్రజలు ప్రభుత్వంపై ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా లోకల్ నాయకులుకు వాళ్లకు కావలసిన వారికే ఇందిరమ్మ ఇల్లు కేటాయింపులు జరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే విషయంలో ఏవిధంగా అయితే సర్వే నిర్వహించారో అదేవిధంగా సర్వే నిర్వహించి అనర్హుల జాబితాను గుర్తించి వారికి మంజూరు అయిన ఇండ్లను రద్దుచేసి అర్హులైన వారికి ఇండ్లను కేటాయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అంతే కాకుండా వాజేడు మండలంలో కొన్ని గ్రామపంచాయతీలలో ప్రజలు దేవుడు వరమిస్తే పూజారి అడ్డు పడ్డట్టు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే కొంతమంది స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు అసలైన లబ్ధి దారులకు రాకుండా వారికి నచ్చిన వారికి ఇల్లు కేటాయించారని,లిస్టులో పేరు వచ్చినప్పటికీ కొంతమంది ఇండ్లను రద్దుచేసి ఒకటికి రెండు లిస్టులు పెట్టి లబ్ధిదారులను అయోమయానికి గురి చేశారని వాపోయారు. ఇకనైనా సంబంధిత అధికారులు సర్వే నిర్వహించి నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
