Sunday, October 26, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆ క్లూ ర్ వెళ్లే దారిలో రోడ్డుపై పోసి ఉంచిన మక్కలను పరిశీలించిన మాజీ మంత్రి...

ఆ క్లూ ర్ వెళ్లే దారిలో రోడ్డుపై పోసి ఉంచిన మక్కలను పరిశీలించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు

Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికె గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో 29.09.2025 మంగళవారం రోజున

బడా భీంగల్ నుండి అక్లూర్ వెళ్లే దారిలో రోడ్ పై కి. మీ మేరా రాసులుగా పోసి ఉన్న మక్కలను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.అక్కడే ఉన్న రైతులతో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడగ ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టక ప్రవేట్ వ్యాపరులకు తక్కువ ధరకు మక్కలు అమ్ముకోవడం వలన నష్టపోతున్నమని రైతులు ఎమ్మెల్యే తో తమ ఆవేదన వెలిబుచ్చారు ఈ సందర్బంగా ప్రభుత్వం వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి క్వింటాలుకు 2400 మద్దతు ధర తో పాటు మీరు ఇచ్చిన హామీ ప్రకారం అదనంగా 400 రూపాయలు ఇచ్చి 2800 లకు కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేసారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ….ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే రైతుల దగ్గర మక్కలు క్వింటాలకు 2800 పోవాలి ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోయేసరికి దలారులకు 1600 లకు రైతు అమ్మేసుకుంటున్నాడు ప్రతి రైతుకు క్వింటాలుకు సుమారు 1000 రూపాయల చొప్పున నష్టపోతున్నారు.ఒకరైతు ఎకరాకు 30 క్వింటాలు మక్కలు పండిస్తే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక ప్రవేట్ వ్యాపారులకు అమ్మి ఎకరాకు 30000 రూపాయలు నష్టపోతున్నాడు రైతులు పంటను సరైన ధరకు అమ్ముకోలేక నష్టపోతు బాధపడుతుంటే ముఖ్యమంత్రి ఎక్కడున్నారు.రైతుల బాధలు పట్టించుకోని ముఖ్యమంత్రి ఉండి ఎం లాభం..నేను ఇప్పటికే ప్రతి పిఎసిఎస్ ద్వారా ఊరురా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వాన్ని అనేక సార్లు డిమాండ్ చేశాను.. అయినా ప్రభుత్వంలో అధికార యంత్రాంగంలో చలనం లేదు వర్షాలు పడుతున్నాయి మక్కలు ఫంగస్ వచ్చినట్లయితే ధర రాక రైతులు ఇంకా నష్టపోయే అవకాశం ఉంది మీరు ఇచ్చిన మాట ప్రకారమే 2400 మద్దతు ధర ఉన్న మక్కలకు అదనంగా 400 కలిపి క్వింతాలూకు 2800 లకు కొనుగోలు చేయాలి వెంటనే ప్రతి ఊరురా కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి లేకుంటే ఈ రైతుల ఉసురు మీకు, ప్రభుత్వానికి కచ్చితంగా తగులుతుంది మీ ప్రభుత్వం క్వింతాలూకు 2800 చెల్లించి కొనుగోలు చేసేవరకు బి ఆర్ ఎస్ పార్టీ రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments