
పయనించే సూర్యుడు జూలై 15 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :
సూళ్లూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన అభిమానులు స్థానిక బిఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలోని విద్యార్థినులకు గొడుగులు పంపిణి చేశారు, ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొని ఆమె చేతులు మీదుగా విద్యార్థినులకు గొడుగులు పంపిణి చేయడం జరిగింది, ఈ సందర్భముగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆకుతోట రమేష్ కు ముందస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు, పుట్టిన రోజు నాడు ఆడంబరాలకు ,సంబరాలకు ఖర్చు చేసే డబ్బుతో ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలను చేయడం వల్ల ఉపయోగం ఉంటుందని అన్నారు, ఆకుతోట రమేష్ అభిమానులు,అనుచరులు మంచి నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే అన్నారు,ఈ కార్యక్రమం లో టిడిపి అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్, కార్యదర్శి AG కిషోర్ , రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు పచ్చవ మాధవ నాయుడు , ఆలీ,కొండల్ రావు,గిరి, హనుమంత రావు,దంతాల రవి తదితరులు పాల్గొన్నారు.
