Tuesday, August 5, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆగష్టు 9 న రాష్ట్రప్రభుత్వం షెడ్యూల్ ఏరియా ఉద్యోగ నియామకాల చట్టం ప్రకటించాలిఆగష్టు 8 న...

ఆగష్టు 9 న రాష్ట్రప్రభుత్వం షెడ్యూల్ ఏరియా ఉద్యోగ నియామకాల చట్టం ప్రకటించాలిఆగష్టు 8 న మారేడుమిల్లి అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ సభను జయప్రదం చేయండిఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 5

ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి ఎటపాక మండల ఛైర్మెన్ కుంజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నల్లకుంట లో ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి ఆధ్వర్యంలో ఆగష్టు 8 న మారేడుమిల్లిలో జరుగనున్న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ సభ గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర కమిటీ సభ్యులు మడివి నెహ్రూ మాట్లాడుతూ..షెడ్యూల్ ఏరియా ఉద్యోగ నియామకాల చట్టం సాధనే లక్ష్యంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివాసీలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ ఆగష్టు 9 న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం షెడ్యూల్ ఏరియా ఉద్యోగ నియామకాల చట్టం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలానే పై డిమాండ్ సాధకోసం ఆగష్టు 8 న మారేడుమిల్లి లో జరిగే రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ సభను ఆదివాసీలంతా భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపిఎజెసి డివిజన్ నాయకులు ఉయిక రాంప్రసాద్, ఎటిఎ నాయకులు తాటి సీతారాములు, మల్లం భద్రయ్య, సవలం రామకష్ణ, కాక లక్ష్మణ్, అనిగి విజయ్ కుమార్, ఉయిక సత్తిపండు, కారం దారయ్య, సోడె వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments