
పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తన కార్యాలయంలో నిరంతర పర్యవేక్షణ చేస్తూ పట్టణ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి గంగాధర్. తమ కార్యాలయానికి ఉదయం 8 గంటలకే చేరుకొని కార్యాలయ నిర్వహణతో పాటు సీసీ కెమెరాల ద్వారా పట్టణ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. నెల్లూరు పాలెం నుండి బట్టే పాడు రోడ్డు వరకు బైపాస్ రోడ్డు, సత్రం సెంటర్ లలో ఏర్పాటు చేసి ఉన్న మొత్తం సీసీ కెమెరాలను తన సమయానుకూలంగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ పట్టణంలోని ట్రాఫిక్ నియంత్రణ ఇతర సమస్యలను కూడా గమనిస్తున్నారు.ఎక్కడ ఇటువంటి గొడవలు జరిగిన ట్రాఫిక్ సమస్య ఏర్పడిన తక్షణం తెలుసుకునేందుకు వీలుగా ఈ సీసీ కెమెరాలు ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ఇలా గమనిస్తూ ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య ఇతర గొడవలు ఏర్పడిన ప్రాంతంలో వెంటనే తమ సిబ్బందిని పంపించి అక్కడి సమస్యను వెంటనే సరి చేస్తున్నట్లు సీఐ గంగాధర్ తెలిపారు.