
పయనించే సూర్యుడు ఆగస్టు 5( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మంత్రి ఆనం ఆదేశాలతో ఆత్మకూరులో రెండు ఆధార శాశ్వత కేంద్రాలు మంజూరు.మున్సిపల్ కార్యాలయం నందు నేటి నుండి శాశ్వత ఆధార్ కేంద్రం ప్రారంభం
నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ కేంద్రమైన ఆత్మకూరు పట్టణంలో శాశ్వత ఆధార్ కేంద్రం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందిని గమనించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ పట్టణ పరిధిలో రెండు శాశ్వత ఆధార్ కేంద్రాలను సిద్ధం చేశారు..ఆత్మకూరు మున్సిపాలిటీలో ఉన్న సచివాలయంలో ఈరోజు నుండి ఆధార్ శాశ్వత కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.గత కొన్ని నెలలుగా ఆత్మకూరు పట్టణంలో ఆధార్ నమోదు కేంద్రం లేకపోవడంతో బయట మండలాలకు వెళ్ళవలసిన పరిస్థితి కలిగి వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయమై స్పందించి నేటి నుండి మున్సిపాలిటీలోని సచివాలయం నందు ఒక కేంద్రాన్ని ప్రారంభించగా రేపటినుండి ఎంపీడీవో కార్యాలయంలో మరొకటి ఆధార్ కేంద్రం ప్రారంభించనున్నారు. ప్రజలు తమ ఆధార సమస్యల కోసం ఈ ఆధార్ కేంద్రాలను ఉపయోగించుకోవాలని తెలిపారు.ఆధార్ కేంద్రం సమస్యలపై స్పందించిన మంత్రి ఆనం కు పట్టణ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.