Saturday, July 12, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆదివాసి ఆరాధ్య దైవం కొమరం భీం విగ్రహాని ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులను వెంటనే పట్టుకోవాలి.

ఆదివాసి ఆరాధ్య దైవం కొమరం భీం విగ్రహాని ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులను వెంటనే పట్టుకోవాలి.

Listen to this article

దుండగులను పట్టుకొని చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి లేకుంటే ఏజెన్సీలో మరో ఆదివాసి ఉద్యమం తప్పదు*.

మా ఆదివాసులను రెచ్చ గొట్టే కుట్రలు చేస్తే ఖబడ్దార్.

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 11

అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట గ్రామంలో సచివాలయం ఎదురుగా ఉన్న ఆదివాసుల ఆరాధ్య దైవమైనటువంటి కొమరం భీం విగ్రహాన్ని 9వ తేదీ బుధవారం రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అలాగే అదే రోజు జగ్గవరం క్రాస్ రోడ్డు ఆదివాసి స్తూపం లో ఉన్న జెండా కర్రను పీకి 100 మీటర్ల దూరం పడేయడం జరిగింది. ఇవన్నీ ఎవరో ఆదివాసి సమాజంపై కక్షపూరిత చర్యలతోనే చేస్తున్నారని, ఈ చర్య వెనకాల ఎంతటి శక్తులున్నా సరే ఉపేక్షించేది లేదని ఆదివాసి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ మా జి.ఓలు,చట్టాల జోలికి వచ్చారు. మా హక్కుల జోలికి వచ్చారు, మా భూముల జోలికి వచ్చారు, చివరికి మా రిజర్వేషన్ల జోలికి వచ్చారు,అయినా సహించాము, కానీ మా ఆదివాసీ ఆరాధ్య దైవం,స్వాతంత్ర సమరయోధులలో ఒక్కరూ జల్ జంగల్ జమీన్ నినాద రూపకర్త కొమరం భీం విగ్రహాన్ని ధ్వంసం చెయ్యడం అంటే మా ఆదివాసి సమాజాన్ని రెచ్చ గొట్టే కుట్రలో భాగమేనని ఈ కుట్రలకు ఎంతటి శక్తులు ఉన్న ఎవరిని వదిలిపెట్టబోమని దీనిపై తక్షణమే విచారణ చేయాలని పోలీస్ వారిని విజ్ఞప్తి చేస్తూ కొమరం భీమ్ ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ విగ్రహం ముందు నినాదాలు చేశారు .దీనిపై త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విగ్రహకమిటీ సభ్యులు తుష్టి జోగారావు, బేతి ముత్తయ్య, సోడే ముత్తయ్య, ఉయిక రాంప్రసాద్, మచ్చ వినయ్ కుమార్, ఆదివాసి నాయకులు పాయం లక్ష్మణరావు, పాయం సుబ్బారావు, చిచ్చడి మహేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments