డి.ఎస్.ఎఫ్ విద్యార్థి సంఘంగా అడ్డుకుంటాం
పయనించే సూర్యుడు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్ (10: జనవరి) (ఆదోని నియోజకవర్గం )
ఈ ప్రెస్ మీట్ ను ఉద్దేశించి డివిజన్ అధ్యక్షుడు రఘు మండల కార్యదర్శి వినీల్ మాట్లాడుతూ…. ఆదోని డివిజన్ లో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే ఖచ్చితంగా ఆ విద్యాసంస్థల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ అలాగే ఉన్నత విద్యాధికారులు , సీటుకు మాత్రమే పరిమితం కాకుండా ఏ విద్యాసంస్థలు అయితే ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు ఆ విద్యాసంస్థలు గుర్తింపు రద్దు చేయాలని డిఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాము…. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెలవు దినాల్లో క్లాసులు నిర్వహించకూడదు. ఏవైతే నిబంధనలో ఉన్నాయో తప్పనిసరిగా పాటించాలని డి. ఎస్. ఎఫ్. విద్యార్థి సంఘంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు హెచ్చరిస్తున్నాము…. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ నాయకులు నవీన్ చరణ్ విశాల్ తదితరులు పాల్గొనడం జరిగింది.