
పయనించే సూర్యుడు: మే 01: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం కర్రిగుట్ట సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ పేరుతో తెలంగాణ రాష్ట్రం భూ భాగమైన కర్రీ గుట్ట లో జరుగుతున్న కగార్ ఆపరేషన్ ను నిలుపుదల చేసి ఆదివాసి గుడిలో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాలనీ ఏఎస్ పి డిమాండ్ చేసింది గురువారం నాడు వాజేడు మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏవీఎస్ పి జిల్లా అధ్యక్షులు బోదే బోయిన సురేష్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆదివాసి సంక్షేమ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు ఉయిక శంకర్ పాల్గొని మాట్లాడుతూ చత్తీస్ ఘడ్ రాష్ట్రం ఆనుకొని విస్తరించి ఉన్న దట్టమైన అడవి గుట్టలు కొండలు కలిగి ఉన్న ఏజెన్సీ ప్రాంతమైన 5వ షెడ్యూల్ భూభాగం తెలంగాణ రాష్ట్రం భూభాగం లో కలిసి ఉన్న దట్టమైన అడవి ప్రాంతం వేలాది ఎకరాల భూమి విస్తీ రణ కలిగిన కర్రీ గుట్టల లో ఖనిజ సంపద ను దోచుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు లను ఏరివేత పేరుతో బలగాలను కగార్ ఆపరేషన్ కర్రీగుట్టల కు కూంబింగ్ కు కేంద్ర బలగాలను పంపించి హెలికాప్టర్ ద్వారా బాంబులు పేల్చడం వలన ప్రజలు ఎపుడు ఏమి జరుగుతుందో ఆదివాసీ ప్రజలు భయాందోళనకు గురౌతు నిద్రలేని రాత్రులు ఆదివాసీలు గడుపుతున్నారు. నీ దీని వెంటనే కగార్ ఆపరేషన్ ను నిలుపుదల చేసి ఆదివాసి గూడెంలో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఉయిక శంకర్ డిమాండ్ చేశారు.ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు ఉన్న దగ్గర అడవి ఉందని ఇక్కడ ఖనిజ సంపద భారతదేశాన్ని మొత్తాన్ని పెంచగలిగే మూలధనం ఖనిజ సంపద ఉండటంవల్ల అడవి ప్రాంతాలను నాశనం చేసి కార్పొరేట్ల కంపెనీలకు దార దత్తం చేయడానికి అడవి ప్రాంతంలో ఉన్న ఆదివాసి గూడేలను ఖాళీ చేయించి ఆ దాని అంబానీ బడా బాబులకు దోచి పెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని ఉయిక శంకర్ ఆరోపించారు. ఆదివాసీలను రాష్ట్ర విభజన వల్ల పోలవరం ప్రాజెక్టు కట్టి రెండు లక్షల 70 వేల ఆదివాసులను జల సమాధి చేస్తున్న నేడు కూడా అదే పరిస్థితి తెలంగాణలో వాజేడు వెంకటాపురం దట్టమైన అడవిలో కర్రెగుట్టల్లో కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ చేయడం వల్ల ఎక్కడైనా ఆదివాసు లే తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ఎవిఎస్పి జిల్లా అధ్యక్షులు బోదే బోయిన సురేష్ ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు తాటి నాగరాజు క ట్టం నరసింహారావు, చిక్కుడు రజిని కుమార్ , ఉయిక జగన్,
మడప, పగడయ్య ,ఎట్టి రవీందర్ ,మాద ఆనంద్, నాగులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
