
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 (జనగాం ప్రతినిధి కమ్మగాని నాగన్న) రాష్ట్రంలో ఉప ఎన్నికల తో పాటు ముఖ్యమంత్రి మార్పు జరగవచ్చని ఆరు మాసాలు దాటితే ప్రభుత్వం కూడా కూలిపోతుందని పాలకుర్తి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి బుధవారం మాట్లాడుతూ చెప్పారు మంత్రుల మధ్య సైక్యత లేక అంతర్గత కమలాటలు మొదలైనాయని ఏ క్షణంలోనే ప్రభుత్వం కూలిపోవచ్చు అని ఆయన జోస్యం చెప్పారు ఈ ఓట్ల ముందు ఇచ్చే రైతుబంధు తప్ప భవిష్యత్తులో కాంగ్రెస్ రైతుబంధుకు రాం రాం చెప్తుందని అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది అని ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు మరో 6 నెలల్లో ఉప ఎన్నికలు రావచ్చు అని కెసిఆర్ ముఖ్యమంత్రిగా టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని అని చెప్పారు పాలకుర్తిలో మార్పు మొదలైందని నమ్మి ఓట్లు వేస్తే నట్టెట్లా ముంచారని పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని ఆయన అన్నారు శాతపురం మాజీ తాజా సర్పంచ్ ఆధ్వర్యంలో 30 మంది కార్యకర్తలు కాంగ్రెస్ నుండి తిరిగి తన సొంత గూటికి చేరార ని ఆయన తెలిపారు దయాకర్ రావు తో పాటు పాలకుర్తి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్ కుమార్ ఎఫ్ ఎస్ సి ఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బిలి అశోక్ రెడ్డి వైస్ చైర్మన్ కార్పోతుల వేణు గిరిజన నాయకులు ఎంకన్న సురేష్ తదితరులు పాల్గొన్నారు