జనవరి 13 పయనించే సూర్యుడు బచ్చన్నపేట మండలం జనగామ జిల్లా. బచ్చన్నపేట మండల ఆర్.ఎం.పి పి.ఎం.పి మండల అధ్యక్షుడిగా ఎన్నికైన బండారి ఆంజనేయులు ను పడమటి కేశవపురం గ్రామ ప్రజలు, నాయకులు ,సామాజిక వేత్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగిటి విద్యనాథ్ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా పడమటి కేశవపూర్ గ్రామంలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ,నిత్యం అందుబాటులో ఉంటున్న బండారి ఆంజనేయులు మండల అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వారి సేవలు ప్రజలకు ఇంకా ఎంతో అవసరం ఉందని అన్నారు.కార్యక్రమంలో నిమ్మ సంజీవరెడ్డి,జంగిటి ప్రభాకర్, చల్ల సంతోష్ రెడ్డి,డాక్టర్ మహాదేవ్,ఎర్రోళ్ల నరసింహ యాదవ్,ఎర్రోళ్ల రాజు ,వనం సదానందం,నరసింహులు,నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్.ఎం.పి, పి.ఎం.పి మండల నూతన అధ్యక్షుడిని సన్మానించిన జింగిటి విద్యనాథ్
RELATED ARTICLES