
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికలలో 42 % బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య హైదరాబాద్ ఇందిరా పార్క్ నందు నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొని సంఘీభావం మద్దతు తెలియజేసిన తెలంగాణ బీసీ విద్యుత్ ఉద్యోగా సంస్థ అధ్యక్షులు కొడపాక కుమారస్వామి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, కార్యనిర్వక అధ్యక్షులు జీ. బ్రహ్మేంద్ర రావు, తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ, పృథ్వి గౌడ్, రామ్ మూర్తి గౌడ్, నంద గోపాల్ మరియు రాష్ట్ర నలుమూలల నుంచి బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపినారు.