
పయనించే సూర్యుడు గాంధారి 05/07/25
మండల అధ్యక్షులుగా తేజవత్ మోతిరంనాయక్ ప్రధాన కార్యదర్శిగా బాధవత్ దశరత్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం గ్రామీణ స్థాయిలో విస్తృతంగా బలోపేతం చేయడానికి జిల్లాలో ఈనెల ఆఖరిలోపు మండలా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసేందుకు కమిటీలు నిర్మించడం జరిగిందని కామారెడ్డి జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు రాథోడ్ సురేందర్ పేర్కొన్నారు.ఈ మేరకు శుక్రవారం గాంధారి మండలంలో ఆల్ ఇండియా బంజారా నూతన కమిటీని జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ నాయక్,జిల్లా ఎన్నికల అధికారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతీసింగ్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.గాంధారి మండల అధ్యక్షులుగా తేజావత్ మోతీరాం,మండల ప్రధాన కార్యదర్శిగా బాధవత్ దశరథ్,మండల ఉపాధ్యక్షులుగా నేనావత్ శ్రీనివాస్,అంగోత్ ప్రకాష్,నేనావత్ గణేష్,జాయింట్ సెక్రెటరీగా దేవసొత్ రాందాస్,ధరావత్ దేవాల, ఆర్గనైజేషన్ సెక్రెటరీగా ధరవత్ జేత్రం,కోశాధికారిగా మాలోత్ సర్దార్,గౌరవ అధ్యక్షులుగా జరుపుల జగ్మాల్ ను నియమించి నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ…రాబోయే రోజుల్లో గాంధారి మండలంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘాన్ని బలోపేతం చేసి బంజారాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు.తమకు కమిటీలో చోటు కల్పించిన రాష్ట్ర,జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు శ్రవణ్ నాయక్ సదర్ నాయక్ మోతిరం నాయక్ లాస్కర్ నాయక్ ఆనంద్ రావు,మోతిలాల్ నాయక్ మోహన్ నాయక్ రమేష్ ఓంకార్ హెమ్ సింగ్ గణేష్ దేవిసింగ్ ఆయా తాండల నాయక్ కార్బరిలు పాల్గొన్నారు.