
- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ..
పయనించే సూర్యుడు //ఫిబ్రవరి //18// హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ //కుమార్ యాదవ్.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతనా,ఆశా కార్యకర్తలకి ఒకరోజు పునచ్చరణ శిక్షణ కార్యక్రమం,నాలుగవ బ్యాచ్ కి హుజురాబాద్ డివిజన్ వారికి నిర్వహించడం జరిగినది.ఇందులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ..ఆశా కార్యకర్తలు చేస్తున్న కృషి సేవలు అభినందనీయం చెప్తూ ఆరోగ్య మహిళ కార్యక్రమానికి ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమునకు మహిళలను తీసుకొస్తూ స్క్రీనింగ్ జరిపిస్తున్నారు. అదేవిధంగా ప్రతి పీహెచ్సీలో గవర్నమెంట్ డెలివరీలు జరిగేటట్లు ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా కోరడం జరిగిందన్నారు . ప్రస్తుత కాలంలో ఎన్ సి డి వ్యాధులు ప్రబలుతున్నాయని ఇవి రాకుండా ఉండడం కొరకు ప్రజలందరూ సమతుల్య ఆహారము తీసుకుంటూ సరియైన వ్యాయామం మరియు యోగా ధ్యానం వంటివి చేస్తు మానసిక ప్రశాంతతతో ఆరోగ్యంగా ఉంటూ డయాబెటిస్, హైపర్టెన్షన్ మరియు గుండెపోటు,క్యాన్సర్ వంటివి రాకుండా ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు , ప్రతిరోజు మనము తీసుకునే ఆహారములో ఇతర తృణధాన్యాలు కూడా చేర్చుకొని తగిన శ్రమ చేస్తూ ఆరోగ్యంగా, మీరు మరియు మీకుటుంబం ఉంటూ సమాజంలో ప్రజలందరికీ అవగాహన కల్పించాలని, ఆశా కార్యకర్తలను కోరారు . జలందరూ కూడా ఉప్పు ,చక్కెర, నూనె, మైదాతో చేసిన పదార్థములు చాలా తక్కువగా తీసుకోవాలని తెలియజేశారు.పిఓడిటిటి డాక్టర్ ఉమా శ్రీరెడ్డి, కుక్క కాటు మరియు నివారణ చర్యలు గురించి ఆశ కార్యకర్తలందరికీ అవగాహన కల్పిస్తూ 2030 సంవత్సర వరకు మన భారతదేశంలో రేబిస్ వ్యాధితో మరణించేవారు ఉండకూడ దన్న లక్ష్యంతో పనిచేయాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిపిహెచ్ఎన్ఓ విమల, హెచ్ ఈ ఈ ఓ రాజగోపాల్, రవీందర్ రెడ్డి, సూపర్వైజర్ స్టాప్ ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు
