
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 11(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండల కేంద్రమైన యాడికిలో శ్రీపెద్దమ్మ తల్లి దేవస్థానం ఆషాడ పౌర్ణమి సందర్భంగా శాకాంబరీ దేవి అలంకరణ చేయడం జరిగింది . ఆ కూరగాయలతో మూడవ శుక్రవారం దాదాపుగా 500 మంది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం పంపిణీ చేయడం జరిగింది ప్రతి శుక్రవారం లాగానే ఈ శుక్రవారం కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమము ఏర్పాటు చేసి రాత్రికి కుంకుమార్చన, మణిద్వీప వర్ణన, భక్తి పాటలు భజన కార్యక్రమం మహా మంగళహారతి తీర్థ ప్రసాదాల పంపిణీ ఉంటుందని ఆలయ అభివృద్ధి కమిటీ వారు తెలిపారు
