
కార్యక్రమంలో పాల్గొన్న షాద్ నగర్ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ మరియు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు
( పయనించే సూర్యుడు మే 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిపుత్రుల సంక్షేమం కోసం ఇందిర సౌర గిరి జల వికాస పథకాన్ని ప్రారంభించారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గిరిజన జల వికాసం పథకానికి రూ.12,600 కోట్ల నిధులు కేటాయించారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా గిరిజనులకు ఆర్వోఎస్ఆర్ చట్టం కింద కేటాయించిన భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 2.10 లక్షల మంది గిరిజన రైతులకు చెందిన 6 లక్షల ఎకరాలకు విద్యుత్, సాగునీటి సౌకర్యం తో పాటు పండ్ల తోటలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకాన్ని గిరిజన సంక్షేమ శాఖ,వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు,సీతక్క,పొన్నం ప్రభాకర్,తుమ్మల నాగేశ్వర రావు,ఉత్తమ్ కుమార్ రెడ్డి,మల్లు రవి,ఉమ్మడి మహబూబ్ నగర్ శాసన సభ్యులు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
