Sunday, February 23, 2025
Homeఆంధ్రప్రదేశ్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రతి దశలో తోడ్పాటు అందించాలి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రతి దశలో తోడ్పాటు అందించాలి

Listen to this article

పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 21. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రతి దశలో తోడ్పాటు అందించాలి….. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే కఠిన చర్యలు ఇందిరమ్మ ఇండ్లపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి ప్రతి మండలంలో ఇసుక డంప్ ఏర్పాటుకు చర్యలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ప్రతి దశలో తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణ పథకం (నిర్మాణం)పై ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల మండల, గ్రామ పంచాయితీ స్థాయి అధికారులతో పాటు మండల ప్రత్యేక అధికారులకు అందించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ప్రజల జీవన విధానంలో అద్భుతమైన మార్పులు తీసుకొని రావచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అర్హులకు ఇళ్లు అందేలా చూడాలని, అలాగే వీటి నిర్మాణంపై ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన ఉండాలని అన్నారు. గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులను ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా మరోసారి వెరిఫై చేయడం జరుగుతుందని అన్నారు. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు చేరవద్దని, తప్పులు ఏమైనా జరిగితే ముందుగానే చెప్పాలని, ప్రతి దరఖాస్తును ఎవరు వెరిఫై చేస్తున్నారు వివరాలు పక్కాగా రికార్డులలో ఉంటాయని, అనర్హులను అర్హులుగా చూపి ఇండ్లు మంజూరైనట్లు తేలితే చాలా కఠినంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జనవరి 26న ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో లాంఛనంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించామని అన్నారు. సొంత జాగా ఉండి ఇల్లు లేని వారు, జాగా ఇండ్లు రెండు లేని వారు, ఆర్.సి.సి. రూఫ్ తో ఉన్నవారు వివరాలతో ఎల్1, ఎల్2, ఎల్3 లుగా మూడు జాబితాలపై అధికారులు పూర్తి అవగాహన కల్గి ఉండాలన్నారు. విడతల వారీగా ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. అత్యంత పేదలకు, ఇండ్లు లేని, స్వంత స్థలం ఉన్నవారికి మొదటి విడతలో ఇండ్లు అందించడం జరుగుతుందని అన్నారు. ప్రజలతో మాట్లాడే సమయంలో అధికారులు ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియపర్చాలన్నారు.
భూమి పూజ నుంచి గృహప్రవేశం వరకు ఇంటి నిర్మాణంలో ప్రతి అడుగులో లబ్ధిదారులకు మనం తోడ్పాటు అందజేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఇంటారాక్ట్ అవుతూ, ప్రతి దశ నిర్మాణంలో సామాగ్రి ధరలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. పేదలను ఎంపిక చేస్తున్న నేపథ్యంలో ఇంటి నిర్మాణం 5 లక్షలు దాటితే పూర్తి చేయడం లబ్ధిదారులకు కష్టం అవుతుందని, ప్రతి దశలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇండ్లు ఎలా కట్టాలో సలహాలు, సూచనలు అందజేయాలని, ఇండ్లు నాణ్యతగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుకను ప్రతి మండల కేంద్రానికి తీసుకుని వచ్చే బాధ్యత జిల్లా యంత్రాంగం తీసుకుంటుందని, మండల కేంద్రం నుంచి లబ్ధిదారులకు అందేలా అధికారులు చూడాలని అన్నారు. మండల కేంద్రంలో పెట్టే ఇసుక డంప్ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని అన్నారు. సిమెంట్ కూడా ఇందిరమ్మ లబ్ధిదారులకు తక్కువ ధరకు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండ్ చేయాలని, రెండు వారాలలో ఇంటి బేస్మెంట్ పనులు పూర్తి అయ్యేలా చూడాలని, బేస్మెంట్ పూర్తయితే లక్ష రూపాయలు విడుదల అవుతాయని అన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మొదటి విడత ప్రభుత్వ సహాయం వచ్చే వరకు పెట్టుబడి లేని లబ్ధిదారులకు స్వశక్తి మహిళా సంఘాల రుణాలు అందించడానికి గల అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. శిక్షణ పొందిన అధికారులతో మండల స్థాయిలో మేస్త్రీలకు తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణంపై శిక్షణ అందిస్తామని అన్నారు.
ప్రతి మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మిస్తున్నామని, అది ఎలా కడ్తున్నారో పంచాయతీ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి సోమవారం పంచాయతీ కార్యదర్శులు మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ ను పరిశీలించాలని అన్నారు. సొంత ఇల్లు ఉంటే ప్రజలకు ధైర్యం పెరుగుతుందని, వ్యాపారాలు పెరుగుతాయని, ఆడపిల్లలను చదివిస్తారని, కుటుంబాలలో మంచి మార్పులు వస్తాయని, పేదవాని ఇంటి కల సాకారం చేసే అవకాశం మనకు వచ్చిందని, ఈ అద్భుత అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ శిక్షణా సమావేశంలో డిఆర్డీవో సన్యాసయ్య, జెడ్పీ సిఇఓ దీక్షా రైనా, డిపిఓ ఆశాలత, హౌజింగ్ పిడి శ్రీనివాసరావు, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments