
పయనించే సూర్యుడు మార్చి 16 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు మండలం పూబెల్లి గ్రామంలో మంజూరైనటువంటి 83 ఇందిరమ్మ ఇండ్ల గృహాలకు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఉదయం స్థానిక ఇల్లందుశాసనసభ సభ్యులు కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించి, భూమి పూజ నిర్వహించారు.వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రెవిన్యూ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లందు పట్టణంలో సుమారు 37 కోట్ల అంచనా వ్యయంతో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులకు స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తో కలిసి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు.