
టిడిపి ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధ్యక్షులు గరిగె వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు
పయనించే సూర్యుడు న్యూస్ 15 సెప్టెంబర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్టర్ మొలుగు సంజీవ
ఇబ్రహీంపట్నం మండల కేంద్ర పరిధి లొ అర్ధరాత్రి ఓల్డ్ సిటీ చార్మినార్ పరిసరాల ప్రాంతాల నుంచి కలుషిత పదార్థాలను ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో జిహెచ్ఎంసి వాహనాలతో డంప్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టిడిపి మున్సిపల్ అధ్యక్షులు గరిగే వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులకు ఆదివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు.ఈ కార్యక్రమంలో జెలమోని రవీందర్, జక్క రామ్ రెడ్డి, మెట్టు దామోదర్ రెడ్డి, వీరాచారి, గౌర నరసింహ, అబ్దుల్ లతీఫ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

