బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్
పయనించే సూర్యుడు జనవరి 13
ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్
రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా
ఉట్నూర్ పట్టణంలో ప్రభుత్వం కొమురం భీమ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ కోరారు సోమవారం ఉట్నూర్ లో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక యూనివర్సిటీ ఉన్నా ఉమ్మడి జిల్లాలో లేదన్నారు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా అని వారు విద్యాపరంగా అభివృద్ధి చెందాలంటే యూనివర్సిటీ అవసరమన్నారు ఉట్నూర్ లో కొమురం భీమ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు