
ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
ఉత్తమ డాక్టర్ అవార్డు గ్రహిత వెంకట్ రమణ ను సన్మానించిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు జూన్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఉత్తమ వైద్యసేవలకు గాను అత్యున్నతమైన ఉత్తమ డాక్టర్ అవార్డు మిరియాల వెంకట రమణ కి రావడం సంతోషించదగిన విషయమని సమాజంలోని అన్ని రంగాలలో పొందే అవార్డల యొక్క ప్రాముఖ్యతను వెలకట్టలేమని చేసిన సేవలకు గుర్తింపుగా దక్కే అరుదైన గౌరవమే అవార్డు అని ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి అన్నారు. ఇటీవలే సుమన్ టివి నిర్వహించిన డాక్టర్ అవార్డ్స్ లో షాద్ నగర్ పట్టణానికి చెందిన మిరియాల వెంకట రమణకు ఉత్తమ డాక్టర్ అవార్డు వచ్చిన సందర్భంగా వారి యొక్క హాస్పిటల్ కి వెళ్లి వారిని శాలువాతో సత్కరించి సన్మానించారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.రానున్న రోజుల్లో షాద్ నగర్ పట్టణ ప్రజలకు మంచి వైద్య సేవలు అందించి వైద్య రంగంలో మరిన్ని అవార్డులు పొందాలని ఆకాంక్షించారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ బీఎస్ సుధీర్,మరియు పలబట్ల శివకుమార్,పలబట్ల బాల్ రాజ్,డాక్టర్ తులసి, అన్వారీ రాజు,కాటా సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
