
పయనించే సూర్యుడు మార్చి11 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లె మండలం నిరుద్యోగులను టార్గెట్ గా ఉద్యోగాలు ఇస్తామంటూ లక్షలు దోచుకొంటున్న దళారులు నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారులను నమ్మవద్దు ఎస్పీ, డి.ఎస్.పి, మరియు రూరల్ సీఐ ఆదేశం అనుసారం ఉద్యోగుల పేరుతో మోసపోయే నిరుద్యోగ యువతీ యువకులకు అవగాహన కల్పించిన ఎస్సై ముత్యాల శ్రీనివాసులు సుండుపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నందు ఉద్యోగులు ఇస్తామని చెప్పిన దళారుల చేతిలో మోసపోయిన నిరుద్యోగ యువతీ యువకులు స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. ఈ మధ్యకాలంలో ఉద్యోగాల పేరుతో మోసపోయిన యువతీ యువకులు ఎక్కువ శాతం ఉన్నారని, కేవలం సుండుపల్లి మండల పరిధిలో దాదాపు 40 లక్షలు రూపాయలు మోసపోయిన వారు ఉన్నారని ఎస్సై తెలిపారు. ఈ విషయంపై ఎస్సై ముత్యాల శ్రీనివాసులు స్పందిస్తూ ఈ మధ్యకాలంలో మోసపోయిన నిరుద్యోగ యువత నుంచి పిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులు చెప్పే మాయమాటలు నమ్మవద్దు అని, అక్రమ మార్గంలో ఉద్యోగాలు సంపాదించడం నేరమని అన్నారు. ఆశపడి అక్రమ మార్గంలో ఉద్యోగం సంపాదించి డబ్బులు కట్టే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం, సంబంధిత వ్వవస్థ ద్వారా వచ్చే నోటిఫికేషన్ ఆధారంగా మాత్రమే నిరుద్యోగులు ఉద్యోగానికి అర్హులు అవుతారని ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా ఉద్యోగం ఇస్తామంటే నమ్మి మోసపోవద్దనిఅన్నారు. బాగా చదివి అందరికీ ఆదర్శప్రాయంగా యువత నిలవాలని కోరారు. అక్రమ మార్గంలో ఉద్యోగాలకు అప్పుచేసి దళారులకు డబ్బులు కట్టి మోసపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువత ఉన్నారని నిరుద్యోగ యువత మేల్కొని మంచి మార్గంలో కష్టపడి చదివి, అర్హతలు సాధించి ఉద్యోగాలు సంపాదించాలని తెలియజేశారు.