
ఎండలో పనులు నిర్వహిస్తున్న ఉపాధి కూలీలు..
రుద్రూర్, ఏప్రిల్ 21 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ గ్రామంలోని చెరువుకట్ట వద్ద ఉపాధిహమీ పనులు నిర్వహిస్తున్న ఉపాధి హామీ కూలీలకు త్రాగునీరు, టెంట్లు, మెడికల్ కిట్లు సరైన వసతులు కరువయ్యాయని ఉపాధి హామీ కూలీలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండు టెండలో ఉపాధి పనులు నిర్వహిస్తున్నామని వాపోయారు. ఉపాధిహామీ కూలీలకు వసతులు కల్పించడంలో అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా మారిందన్నారు.