
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.
పయనించే సూర్యుడి న్యూస్: మార్చి 1, పెనుగొండ(మం), పశ్చిమగోదావరి జిల్లా రిపోర్టర్ అక్షింత్ :పెనుగొండ మండలం దేవ గ్రామంలో మంచినీటి చెరువులో పనిచేస్తున్న ఉపాధి కూలీలతో వ్యవసాయ కార్మిక సంఘం నుండి జక్కం శెట్టి సత్యనారాయణ, మండల కార్యదర్శి షేక్ పాదుషా, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సూర్నిడి వెంకటేశ్వరరావు బృందం పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్లో ఫోటో విధానం కూలీలకు చాలా ఇబ్బందిగా ఉందని ప్లే స్లిప్పులు లేకపోవడం వేతనం ఎంత పడిందో తెలియడం లేదని బ్యాంకుల కంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా వేతనం అందించే ఏర్పాటు చేయాలని కూలీలు కోరారు. ఈ సందర్భంగా సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, బాదుషా మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో నే ఎండలు మండిపోతున్నాయని 10:30 కల్లా పని పూర్తి చేసి మస్తర్ వేసే విధానం చేపట్టాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి హామీలో వేతనం పెంచి, పని దినాలు పెంచాలన్నారు.గురువారం పని పూర్తయిన తర్వాత అస్వస్థకు గురై చనిపోయిన పిల్లి లక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం నుండి 500000 ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నల్లూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు కూలీలకు ఉపాధితో పాటు గ్రామ మౌలిక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని దీనికి నిధులు మరింత పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో మామిడి శెట్టి శ్రీదేవి, పి లలిత, విల్సన్, రాంబాబు, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.