
మృతి చెందిన మాగిరి గంగాధర్…
రుద్రూర్, మే 14 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామానికి చెందిన మాగిరి గంగాధర్ (20) అను యువకుడు ఫోన్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడటానికి అలవాటు పడ్డాడని, ఆన్ లైన్ గేమ్స్ ఆడటానికి తన తండ్రి ఫోన్ నుండి 5000 రూపాయలు తన ఫోన్ కి పంపుకొని ఆన్ లైన్ లో గేమ్స్ ఆడి ఆ డబ్బులను పోగొట్టుకున్నాడు. డబ్బులు పోయాయన్న మనస్థాపంతో గంగాధర్ నిన్న రాత్రి సమయంలో రాయకూర్ గ్రామంలో ఉరి వేసుకొని మృతి చెందాడు. మృతుని తండ్రి మాగిరి పోశెట్టి ఫిర్యాదు మేరకు బుధవారం ఎస్సై పి.సాయన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.