
పయనించే సూర్యుడు ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్ ) సెప్టెంబర్, 15:-
వాళ్లంతా 23 సంవత్సరాల క్రితం వరకు కలిసి ఆడారు, కలిసి చదివారు కలిసి కష్టసుఖాలు పంచుకున్నారు. వాళ్లంతా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2001-02 సంవత్సరంలో పదో తరగతి పూర్తయ్యాక ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు, అనేక విధులు నిర్వహణలకు దూర దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. తమ చిన్నతనం నుండి 10 సంవత్సరాల పాటు కలిసి ఆడి పాడి చదువుకున్న వారంతా 20 సంవత్సరాలు పాటు ఎడబాటు తర్వాత ఒకసారి కలిసే సరికి మరల చిన్నతనాన్ని నెమరు వేసుకుంటూ ఆడుతూ పాడుతూ తమ పూర్వ పాఠశాల ఆవరణలోనే ఈ ఆదివారాన్ని ఉల్లాసంగా గడిపారు. వీరిలో అనేకమంది ఇంజనీర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులు గాను , గృహిణిలుగాను స్థిరపడ్డవారే. తమకు పాఠాలు చెప్పి, సరిగ్గా చదవకపోయినా, పాఠశాలకు డుమ్మా కొట్టిన తమ మంచి కోసమే వీపి పగులగొట్టి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడంతో పాటు వారితో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ద్వారా మరోసారి చిన్నపిల్లలు గా మారిపోయారు. ఈ సంవత్సరం డీ ఎస్ సి పాసై ఉపాధ్యాయుడిగా బాధ్యతలు చేపడుతున్న తమ బ్యాచ్ కు చెందిన విప్పర్తి విజయ్ కుమార్ ను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు ఎండి ఇబ్రహీం ఖాన్, జహురుద్దీన్, జ్యోతి రాజు, సుబ్బారావు, అప్పాజి, రామనాథం, వెంకటరెడ్డి, సంజీవయ్య వీరభద్ర రావు ఉన్నారు.