
తోటి ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడిన వ్యక్తి మరియు సి.హెచ్.ఓ.ల అసోసియేషన్ వారు క్షమాపణలు చెప్పాలి
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 6
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం, కూనవరం పి హెచ్ సి వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి కరక అర్జున్ మాట్లాడుతూ సమస్యలపై పోరాటం చేయాల్సిన వారు వారి సమస్యల కోసం పోరాటం చేయకుండా ఎ ఎన్ ఎం మరియు సూపర్వైజర్ జీతాలు గురించి వారి చదువుల గురించి మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనం అని అన్నారు సమస్యల కోసం పోరాటం చేయడం మంచిదే కాని ఆ పోరాటం పేరుతో మిగిలిన ఉద్యోగులను తక్కువ చేస్తూ మాట్లాడటం, జీతాలు, చదువుల కోసం మాట్లాడటం సరైన విధానం కాదు ,చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకోవాలని అని అన్నారు అలాగే ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం చింతూరు డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసరావు సూపర్వైజర్ మాట్లాడుతూ తోటి ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడే వరకు ఉన్నారు అంటే వారి నాయకులు ఎలా ఉన్నారు అనేది అర్థం అవుతుంది అన్నారు ఇలాంటి వాటిని ఖండించకుండా సపోర్ట్ చేస్తున్న వారి నాయకత్వం ఒకసారి ఆలోచించాలని అన్నారు తక్షణం ఎ ఎన్ ఎం మరియు సూపర్వైజర్ లకు సి.హెచ్. ఓ.లు క్షమాపణలు చెప్పాలి ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కూనవరం మెడికల్ ఆఫీసర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలోని హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్ గారు, ఏ.ఎన్.ఎం లు మల్లేశ్వరి, .లక్ష్మి,సుజాత,పద్మ,దివ్యభారతి,వెంకటమ్మ,టి .లక్ష్మి,అరుణకురి,హెల్త్ అసిస్టెంట్లు అర్జున్,రామకృష్ణ, రత్తయ్య,వెంకటేశ్వర్లు పాల్గొనడం జరిగింది.