పయనించే సూర్యుడు న్యూస్ (జనవరి.24/01/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్:- నారాయణవనం లోని ఎం ఆర్ సి భవనానికి నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడను సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం ఎమ్మార్సీ ప్రాంగణంలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచే పనులు చేపట్టారు. ఈ సందర్భంగా సత్యవేడు ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యావ్యవస్థ పటిష్టం అవుతుందని, ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్, ఎంపీపీ దివాకర్ రెడ్డి, నెడ్ క్యాప్ మాజీ చైర్మన్ యాకాంబారం, డీ వై ఈ ఓ ప్రభాకర్ రాజు, ఎంపిడిఓ, టిడిపి నాయకులు భాస్కర్, మాణిక్య రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
ఎం ఆర్ సి భవన ప్రహరీ ప్రారంభోత్సవంలో సత్యవేడు ఎమ్మెల్యే
RELATED ARTICLES