
వికలాంగుల వృద్ధుల వితంతుల పింఛన్ దారుల పింఛన్ పెంపుకై జిల్లా సమావేశం
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 14 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్
చేగుంట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి మెదక్ జిల్లా ఇన్చార్జి సైదులు మాదిగ హాజరైనారు. మెదక్ జిల్లాలో ఉన్న ప్రతి మండలానికి ఒక ఇన్చార్జిలో నియమించడం జరిగింది . ఈ నెల 15వ తేదీన సోమవారం వికలాంగుల మహా గర్జన ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఉంటుంది. వికలాంగులు దీక్షలో కూర్చుంటారు కాబట్టి ప్రతి ఒక్క మండల ఇన్చార్జిలు నేను నియమించిన వాళ్లంతా పనులలో ఉండాలని అదేవిధంగా గ్రామ ల లో కూడా నిరసన కార్యక్రమాలు కూడా చేయవలసిన అవసరం ఉంది అని అన్నారు. 15- 9- 2025 సోమవారం ఉదయం చేగుంట తాసిల్దార్ కార్యాలయం వరకు విలాంగుల ఆసరా చేయూత పింఛన్ దారుల ర్యాలీ, ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర దీక్షలు ఉంటాయి అని అన్నారు. ఏదైతే మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాటలు నిలబడుచుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం గ్రామాల్లో ఉన్న వికలాంగు లు వితంతువులు బీడీ కార్మికులు పింఛన్ పొందుతున్న వారందరూ అందరూ తప్పనిసరి రావాలి మండల తాసిల్దార్ ఆఫీస్ దగ్గరికి అని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ వికలాంగుల పోరాట సమితి జిల్లా నాయకులు మండల నాయకులు సీనియర్ నాయకులు అందరూ సహకారాలు హాజరై ఈ కార్యక్రమమును విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ చేగుంట మండల అధ్యక్షుడు రామస్వామి మాదిగ ఆధ్వర్యంలో జరిగినది. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు హుస్సేన్ గళ్ళ మురళి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెర్లపల్లి యాదగిరి మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు దండోలు సామెల్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి సుధాకర్ మాదిగ, చేగుంట మండల కోశాధికారి బక్క సాయి బాబా, కొన్మండ శంకర్ గూని శీను వికలాంగుల జిల్లా అధ్యక్షులు పాండు మాదిగ మహిళ అధ్యక్షులు మాధవి మాదిగ మహిళా విభాగం స్వరూప భూమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లేష్ మాదిగ తూప్రాన్ రాములన్న నాయకులు రమేష్ ఎంఆర్పిఎస్ వి హెచ్ పి ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు NED