
ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డికి కృతజ్ఞతలు
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 14(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
తాడిపత్రి వ్యవసాయ మార్కెట్ యార్డు డైరెక్టర్ గా యాడికి మండల కేంద్రానికి చెందిన జూటూరు షహరాబాను ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం షహారా బాను మాట్లాడుతూ తాడిపత్రి వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా నన్ను ఎంపిక చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి, మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డికి యాడికి మండల కూటమి నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం షహారా భాను ను పూల హారాలతో ఘనంగా సత్కరించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా రైతులకు సంక్షేమం మరియు మార్కెట్ యార్డ్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూటూరు అబ్దుల్ రజాక్ జూటూరు ఫిరోజ్, జూటూరు ఆర్షద్, ఆనంద్ గంగ, రంగా నాగార్జున నారాయణస్వామి పాల్గొన్నారు.
