ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆదివాసి సంక్షేమ పరిషత్
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 9
గురువారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ మరియు ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో వేలేరుపాడు లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో భారత రాజ్యాంగం ఆదివాసుల హక్కుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ చట్టాలను అమలు చేయని ఏజెన్సీ ప్రాంత అధికారులు పై క్రిమినల్ కేసులు వేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేలేరుపాడు మరియు ఏలూరు జిల్లా ఏజెన్సీ ఉన్న ప్రాంతంలో ఆదివాసి చట్టాలను అమలు చేయకుండా జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో, రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్, స్థానిక ఎమ్మార్వో, ఎంపీడీవో మరియు స్థానిక రెవెన్యూ, పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని దీని మూలాన ఏజెన్సీ ప్రాంత హక్కులు ఆదివాసులకు అందని ద్రాక్ష గానే మిగులుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. వేలేరుపాడు మండలంలో పోలవరం ప్రాజెక్టు కింద ముంపుకు గురవైన ఆదివాసులకు చాలా మందికి ఇప్పటికీ సరైన న్యాయం జరగలేదని భూమికి భూమి కోసం నష్టపరిహారం కోసం ఇంకా కార్యాలయాలు చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆయన అన్నారు. అన్ని హాక్కుపత్రాలు ఉన్న కొంత మందికి భూమి లేదంటూ సాకులు చూపిస్తూ, ఆదివాసిల దగ్గర ఉన్నవి నకిలీ ధ్రువపత్రాలని అధికారులు చెప్పటం దుర్మార్గమైన విషయమని అన్నారు. కానీ మైదాన ప్రాంతాల నుండి పలసల వచ్చి వేలేరుపాడు ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టానికి వ్యతిరేకంగా నివాసాలు ఏర్పరచుకొని అక్రమ కట్టడాలు కట్టుకొని భూకబ్జాలు చేసి ప్రభుత్వ భూములను ఆదివాసి భూములను ఆక్రమించుకొని వ్యవసాయం చేసుకుంటున్న వారికి మాత్రం ఎటువంటి కొర్రి లేకుండా దొడ్డిదారిలో కోట్ల రూపాయలు పోలవరం నష్టపరిహారం చెల్లించారని ఆయన మండిపడ్డారు. నాన్ ట్రైబల్స్ కి ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా పోలవరం ప్యాకేజీ ఏవిధంగా ఇచ్చారో బహిరంగంగా తెలియజేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేలేరుపాడు మండల కేంద్రం మొత్తం కూడా నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలు మరియు వ్యాపార దుకాణాలు నడుస్తున్నాయని ఆర్ అండ్ బి స్థలాలను కూడా ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తా ఉంటే 1/70 చట్టం, 1905 భూ అక్రమ నిషేధిత చట్టం మరియు 188 జీవో ప్రకారం వాటిపై చర్యలు తీసుకోకుండా రెవెన్యూ, పంచాయతీ, ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు తెలియజేయాలని ఆయన ప్రశ్నించారు. చట్టాలకు విరుద్ధంగా మైదాన ప్రాంతాల నుండి వలస వచ్చిన నాన్ ట్రైబల్స్ కి స్థిర నివాసాలు కట్టుకోవటానికి వ్యాపారాలు నిర్వహించడానికి NOC లు జారీ చేస్తున్న స్థానిక పంచాయతీ రెవిన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల ప్రధాన కార్యదర్శి ఉయిక ముత్యాలరావు, ఏవీఎస్పీ మండల అధ్యక్షులుపొట్ల మోహన్ దొర, శ్రీకాంత్, గణేష్, బ్రహ్మయ్య, పుల్లారావు, వెంకటేష్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు

