Wednesday, October 22, 2025
Homeఆంధ్రప్రదేశ్ఏజెన్సీలో 100% ఉద్యోగాలు ఆదివాసులతోనే భర్తీ చేయాలి *

ఏజెన్సీలో 100% ఉద్యోగాలు ఆదివాసులతోనే భర్తీ చేయాలి *

Listen to this article

ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి

భారీ వర్షంలోను ఆదివాసీ నిరుద్యోగుల భారీ ర్యాలీ చింతూరు నుండి ఎర్రంపేట వరకు ఆకుపచ్చ మాయం

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 13 అల్లూరి సీతారామరాజు జిల్లా

రంపచోడవరం నియోజకవర్గం చింతూరు డివిజన్ ఐటీడీఏ ఎదుట ఆదివాసి అనుబంధ సంఘాలు చలో చింతూరు ఐటిడిఏ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది ఆదివాసీ నిరుద్యోగ యువతి యువత,నిరుద్యోగులు ఆదివాసి అనుబంధ సంఘాలు భారీ వర్షం సైతం లెక్కచేయకుండా ఏజెన్సీలో 100% ఉద్యోగాలు ఆదివాసీలతో భర్తీ చేయాలి, అనే మహా ధర్నా ను కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో నియామక చట్టం చెయ్యాలని, ఆదివాసి స్పెషల్ డిఎస్సి నియమాక చట్టం ద్వారానే భర్తీ చేయాలని ఆదివాసీలు చలో ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం చింతూరు సంతపాకల నుండి ఐటీడీఏ వరకు భారీ వర్షం సైతం లెక్కచేయకుండా వేలాదిమంది నడుచుకుంటూ చింతూరు నుండి ఎర్రంపేట ఐటిడిఏ భారీ ర్యాలీ వరకు నిర్వహించారు. ప్రభుత్వ నుండి సరైన స్పష్టత వచ్చేవరకు మేము ఇక్కడి నుండి కది లేదు అని ఐటీడీఏ గేట్ ముందు బైఠాయించారు. ఆదివాసి జేఏసీ జాతీయ నాయకుడు మడివి నెహ్రూ మాట్లాడుతూ చలో ఐటిడిఏ కార్యక్రమం ఐటిడిఏ ముట్టడి అని తెలిసి కూడా ప్రాజెక్ట్ అధికారి ఈ ఐ టి డి ఏ లో లేకపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులచే ఉద్యోగ నియమాక చట్టం చెయ్యాలి, ఏజెన్సీలో 100% రిజర్వేషన్ స్థానిక ఆదివాసులతోనే ప్రతి ఒక్క పోస్ట్ 29 శాఖకలలో కల్పించాలని డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.అలాగే ఆదివాసీ నిరుద్యోగులకు ఏజెన్సీ స్పెషల్ డీస్సీ నిర్వహించిన న్యాయం చెయ్యాలి అన్నారు అనంతరం ఆదివాసి గిరిజన సంఘం జాతీయ నాయకులు పి అప్పలనర్స్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులు లకు మెగా డీస్సీ పేరుతో స్థానిక ఆదివాసీలకు 5000 టీచర్ పోస్టులు నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు అలాగే మెగాడీఎస్సీ ద్వారా ఏజెన్సీ ప్రాంతాలకు వస్తున్న గిరిజనేతర ఉపాధ్యాయలను మైదాన ప్రాంతాలలో పోస్టింగ్ ఇవ్వాలి అన్నారు.ఏజెన్సీ ప్రాంతంలో పేసా చట్టం సుప్రీం నిర్ణయం తో సమానం అన్నారు ఏజెన్సీలో ఆదివాసులు చట్టాలు హక్కులు పటిష్టం అమలు చేయాలి అన్నారు ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముంజ శ్రీను మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70చట్టానికి విరుద్ధంగా గిరిజ నేతలు అక్రమ కట్టడాలను తొలగించాలని సుప్రీంకోర్టు మరియు రాష్ట్ర హైకోర్టు సూచనలు అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఆక్రమణలు తొలగించిన చింతూరు ఏజెన్సీలో మాత్రం అక్రమ కట్టడాలు తొలగించలేదని వెంటనే అక్రమ కట్టడం తొలగించాలని ఆయన కూడా పేర్కొన్నారు.ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్, సీసం సురేష్ ఆదివాసి జేఏసీ చింతూరు డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ వైస్ చైర్మన్ లోఉయిక రామ్ ప్రసాద్,కారం సాయిబాబు పోడియం.రామకృష్ణ,కాక సీతారామయ్య మడివి రాజు గిరిజన సంఘం జిల్లా నాయకులు పూనెం. ప్రదీప్, బాబు.బుర్రయ్య, ప్రజా ప్రతినిధులు కూనవరం జడ్పిటిసి గుజ్జ.విజయ వి.ఆర్ పురం.ఎంపీపీ ఎం లక్ష్మి సర్పంచులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments