
కుక్కునూరు లో ఆదివాసి సంక్షేమ పరిషత్ సమన్వయ సమావేశం
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 5
శనివారం నాడు కుక్కునూరు మండల కేంద్రం నందు ఆదివాసి సంక్షేమ పరిషత్ మరియు ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆదివాసి సంక్షేమ పరిషత్(274/16) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ భూభాగంలో భారత రాజ్యాంగం ఆదివాసులకు ప్రత్యేక చట్టాలు హక్కులను కల్పించడం జరిగిందని. కానీ ఈ ప్రాంతంలో ఉంటున్నటువంటి పాలకులు గానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏజెన్సీ ప్రాంతంలోని ప్రత్యేక చట్టాలను అమలు చేయకుండా మైదాన ప్రాంతం వలె పరిపాలన కొనసాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 1/70 చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల నుండి విచ్చలవిడిగా నాన్ ట్రైబల్స్ వలసలు వచ్చి కుక్కునూరు మండల కేంద్రం మరియు కుక్కునూరు ఏజెన్సీ మొత్తం ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కట్టి స్థిర నివాసాలు వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసి ఉన్నారని కానీ వాటి మీద మండల రెవెన్యూ పంచాయతీ అధికారులు గానీ ఆర్ అండ్ బి అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తపరిచారు. పోలవరం ముంపుకు గురవుతున్నటువంటి ప్రాంతాలలో మైదాన ప్రాంతాల నుండి వలస వచ్చిన నాన్ ట్రైబల్స్ ప్రభుత్వ భూములను ఆదివాసి భూములు కబ్జా చేసి తప్పుడు పద్ధతులు పోలవరం నష్టపరిహారం పొందారని. ఈ విధంగా అధికారులు కమిషన్లకు కక్కుర్తి పడి కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని చట్ట విరుద్ధంగా నాన్ ట్రైబల్స్ కి దోచి పెట్టారని ఆయన విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి రిజర్వేషన్లతోటి గెలిచిన ఆదివాసి ఎమ్మెల్యేలు ఎంపీటీసీ జడ్పిటిసి సర్పంచులు ఉండి కూడా ఆదివాసి చట్టాలను అమలు చేయించడం విపలమవుతున్నారని ఇదే అదునుగా చేసుకున్న అధికారులు నాన్ ట్రైబల్స్ తోటి కుమ్మక్కై ఆదివాసి చట్టాలను తుంగలోకి తొక్కి నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలు కట్టడానికి NOC ధ్రుపత్రాలు జారీ చేస్తున్నారని ఇది పూర్తిగా వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి విరుద్ధమని ఆయన అన్నారు. బయట ప్రాంతం నుంచి వలస వచ్చి వ్యాపారాలు చేస్తున్న వారికి విద్యుత్ శాఖ వారు ఏ విధంగా విద్యుత్ మీటర్లు జారీ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గౌరవ న్యాయస్థానాలు ఆదేశాలనుసారం మరియు ఆదివాసి చట్టాలు ప్రకారం కుకునూరు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలన్నీ కూడా తక్షణమే తొలగించాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం నూతన మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూరం సంజీవరావు, ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు సరియం ప్రసాద్, పోడియం వేణు, పైదా బుర్రయ్య, బిట్ట శివలింగయ్య, జెట్టి రఘుబాబు, పైదా చిన్నబాబు కూరం ప్రసాదు, తురసం నరసింహారావు వెలకం అశోక్ కుమార్ కుంజ ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు
